- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Apple iphone లో సోనీ కెమెరా సెన్సార్‌లు

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో అత్యుత్తమ ఫోన్లు అంటే ముందుగా గుర్తుకువచ్చేది ఆపిల్‌కు చెందిన ఐఫోన్‌లు మాత్రమే. ఆపిల్ తన ఉత్పత్తుల డిజైన్‌ల పరంగా ప్రైవసీని మెయింటెన్స్ చేస్తుంటుంది. దాని స్పెసిఫికేషన్‌లు, డిజైన్ అన్ని కూడా లాంచ్ టైంలోనే తెలుస్తాయి. కానీ ఇటీవల ఐఫోన్‌ల గురించి ఒక వార్త బయటకు వచ్చింది. రాబోయే ఐఫోన్ కెమెరాలో సోనీ కెమెరా సెన్సార్‌లను ఉపయోగించనున్నారని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ అధికారికంగా పేర్కొన్నారు. ఐఫోన్‌లో కెమెరాను తయారు చేయడానికి సోనీతో భాగస్వామ్యం చేసుకున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
నివేదికల ప్రకారం iPhone 15లో సోనీ కెమెరాలు రాబోతున్నాయని తెలుస్తోంది. మాములు సెన్సార్‌లతో పోలిస్తే, సోనీ ప్రతి పిక్సెల్‌లో అత్యుత్తమ సిగ్నల్ స్థాయిని కలిగి ఉన్నట్లు నివేదించబడింది. సోనీ ప్రస్తుతం తన కొత్త సెన్సార్ కోసం సెమీకండక్టర్ టెక్నాలజీ తో ప్రయోగాలు చేస్తోంది. రానున్న రోజుల్లో కూడా ఆపిల్-సోనీ మధ్య భాగస్వామ్యం ఇలాగే ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు.