లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సోమవారం ఉదయం నుంచే సానుకూలంగా ప్రారంభమైన ట్రేడింగ్ రోజంతా అదే ధోరణిలో కొనసాగింది.
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సోమవారం ఉదయం నుంచే సానుకూలంగా ప్రారంభమైన ట్రేడింగ్ రోజంతా అదే ధోరణిలో కొనసాగింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచింది. అయితే, చివరి వరకు అధిక లాభాలతో ర్యాలీ చేసిన సూచీలు ఆఖరు గంటలో ఇన్వెస్టర్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు మొగ్గు చూపడంతో లాభాలు తగ్గాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 240.36 పాయింట్లు లాభపడి 62,787 వద్ద, నిఫ్టీ 59.75 పాయింట్లు పెరిగి 18,593 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, ప్రైవేట్ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు రాణించాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు బలహీనపడ్డాయి.
సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎల్అడ్‌టీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్, నెస్లే ఇండియా, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.66 వద్ద ఉంది.