ఎన్‌డీటీవీ షేర్లు కొనేందుకు సెబీ అనుమతి అవసరం లేదు: అదానీ!

ముంబై: ఆర్ఆర్‌పీఆర్ హోల్డింగ్ షేర్లను తమ ప్రమోటర్ కంపెనీ వీసీపీఎల్‌కు బదిలీ చేయడానికి సెబీ అనుమతి అవసరం లేదని అదానీ గ్రూప్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది..Latest Telugu News

Update: 2022-08-26 09:29 GMT

ముంబై: ఆర్ఆర్‌పీఆర్ హోల్డింగ్ షేర్లను తమ ప్రమోటర్ కంపెనీ వీసీపీఎల్‌కు బదిలీ చేయడానికి సెబీ అనుమతి అవసరం లేదని అదానీ గ్రూప్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు రాసిన లేఖలో, వాటాలను బదిలీ చేసుకునేందుకు సెబీ అనుమతి తప్పనిసరి అని ఎన్‌డీటీవీ చేస్తున్న వాదనను నిరాకరించింది. సెక్యూరిటీ మార్కెట్లలో ఎన్‌డీటీవీ ప్రమోటర్లుగా ఉన్న ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లు లావాదేవీలు జరపకుండా నిషేధం విధించింది. ఇది వారిద్దరికి మాత్రమే వర్తిస్తుందని, ఈ వ్యవహారంలో ఆర్ఆర్‌పీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని అదానీ ఎంటర్‌ప్రైజెట్ వెల్లడించింది. వీసీపీఎల్‌కు ఆర్ఆర్‌పీఆర్ హోల్డింగ్ పంపిన లేఖలో లేవనెత్తిన అంశాలు నిరాధారమైనవి, చట్టబద్ధంగా సమర్థించలేనివని అభిప్రాయపడింది.

కాబట్టి తక్షణమే ఆర్ఆర్‌పీఆర్ చెల్లించని రుణాల కింద ఈక్విటీ షేర్లను కేటాయించాలని పేర్కొంది. ఈ వారం ప్రారంభంలో ఎన్‌డీటీవీలో 29.18 శాతం వాటాన్ను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్, అదేరోజు సంస్థలో అదనంగా మరో 26 శాతం వాతా కోసం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. కాగా, అదానీ కొనుగోలు వ్యవహారంతో ఎన్‌డీటీవీ షేర్లు వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్‌ను తాకుతున్నాయి. శుక్రవారం కూడా మిడ్-సెషన్ సమయానికి షేర్ ధర 4.67 శాతం పుంజుకుని రూ. 426.65 వద్ద ఉంది. మరోవైపు, అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్ కంపెనీల్లో అదనంగా మరో 26 శాతం వాటా కోసం శుక్రవారం ఓపెన్ ఆఫర్ ప్రక్రియ మొదలుపెట్టింది. దీనికోసం సంస్థ రూ. 31 వేల కోట్లను వెచ్చించనుండగా, ఈ ప్రక్రియ సెప్టెంబర్ 9న ముగియనుంది. 

Tags:    

Similar News