అధిక వడ్డీ గల 'ఎస్‌బీఐ వీకేర్' గడువు పొడిగింపు

దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ తన స్పెషల్ ఎఫ్‌డీ పథకం 'ఎస్‌బీఐ వీకేర్' గడువును మరోసారి పొడిగించింది

Update: 2023-11-20 13:09 GMT
అధిక వడ్డీ గల ఎస్‌బీఐ వీకేర్ గడువు పొడిగింపు
  • whatsapp icon

ముంబై: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ తన స్పెషల్ ఎఫ్‌డీ పథకం 'ఎస్‌బీఐ వీకేర్' గడువును మరోసారి పొడిగించింది. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ పథకాన్ని 2024, మార్చి 31 వరకు కొనసాగిస్తున్నట్టు బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఎఫ్‌డీ పథకాన్ని ఎంచుకున్న వారికి ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలవ్యవధిపై అత్యధిక వడ్డీ రాబడి అందుతుంది.

సీనియర్ సిటిజన్లకు ఈ పథకం కింద 7.50 శాతం అధిక వడ్డీ ఇస్తుంది. కొత్త డిపాజిట్ చేసే వారితో పాటు రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు సాధారణంగా ఖాతాదారుల కంటే అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. 'ఎస్‌బీఐ వీకేర్' ద్వారా మరో 0.50 శాతం అదనంతో 1 శాతం ఎక్కువ వడ్డీ ఆదాయాన్ని పొందే వీలుంటుందని ఎస్‌బీఐ వివరించింది.

ఈ పథకం ప్రకారం, 60 ఏళ్లు దాటిన వారు దీనిని ఎంచుకోవచ్చు. నేరుగా బ్యాంకులోనే కాకుండా నెట్‌బ్యాంకింగ్, యోనో బ్యాంక్ యాప్ నుంచి కూడా ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం 5-10 ఏళ్ల కాలానికి అందుబాటులో ఉంటుంది. రూ. 2 కోట్ల వరకు డిపాజిట్ చేసుకునే వీలుండటమే కాకుండా డిపాజిట్ మొత్తాన్ని హామీగా ఉంచి రుణం తీసుకునే అవకాశం ఉంటుంది.


Similar News