SBI FD alert! ఖాతాదారులకు అలర్ట్.. ఆ స్కీమ్‌కి నేడే లాస్ట్ డేట్
తమ బ్యాంకు ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక సూచనలు జారీ చేసింది. ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్ నేటితో ముగియనుంది అని తెలిపింది.
దిశ, వెబ్‌డెస్క్ : తమ బ్యాంకు ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక సూచనలు జారీ చేసింది. ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్ నేటితో ముగియనుంది అని తెలిపింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి, 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఎస్‌బీఐ ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. సాధరణ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలీస్తే తక్కువ కాలవ్యవధికి సంబంధించిన పిక్స్‌డ్ డిపాజిట్లకు ఎక్కువ వడ్డీరేట్ ఇవ్వడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం. ఎస్‌బీఐ ఈ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌ను ఆగస్టు 15, 2022 నుంచి ఈ నెల 28 వరకు అందుబాటులో ఉంచింది. కాగా నేటితో దీని గడువు ముగుస్తుంది. ఎస్‌బీఐ ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై గరిష్టంగా 6.10 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్ ఎస్‌బీఐ హోల్డర్లకు రెగ్యులర్ రేటుకి అదనంగా మరో 0.50 శాతం వడ్డీ రేటుని ఆఫర్ చేస్తుంది.ఈ స్కీమ్‌లో వడ్డీ రేటుని నెలవారీ, క్వార్టర్లీ, ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తుంది. అంతేకాకుండా ఈ ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్ టెన్యూర్ వెయ్యి రోజులుగా ఉంది. కొత్త, రెన్యూవల్ చేసుకునే డిపాజిట్లన్నింటికీ కూడా ఈ స్పెషల్ స్కీమ్ వర్తిస్తుంది.