అంచనాలను దాటిన SBI లాభాలు
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పన్ను తర్వాత (PAT) లాభంలో 68.5 శాతం వృద్ధితో రూ. 14,205 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ. 8,431.9 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో కేటాయింపులు తగ్గడం, అలాగే, రుణ రికవరీ పెరగడం వలన బ్యాంకు లాభం అంచనాలను దాటి వృద్ధి చెందినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
నికర వడ్డీ ఆదాయంలో భారీ పెరుగుదల కనిపించింది. ఇది గత ఏడాదిలో ఇదే సమయానికి రూ. 30,687 కోట్లు ఉండగా, సమీక్షించిన త్రైమాసికంలో 24 శాతం పెరిగి రూ.38,068 కోట్లకు చేరుకుంది. అలాగే నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ రేషియో 0.77 శాతంగా నమోదైంది. కేటాయింపుల పరంగా గత ఏడాదితో పోలిస్తే 17 శాతం తగ్గి రూ. 5,761 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ నిర్వహణ లాభం ఏడాదికి 36 శాతం పెరిగి రూ. 25,219 కోట్లకు చేరుకుంది.
ఇవి కూడా చదవండి : ఈ ఒక్క స్టోరీ చదవండి చాలు... సక్సెస్ మీ ఇంటి తలుపులు తడుతుంది!