వికలాంగులకు ఉచితంగా డోర్ స్టెప్ సేవలందించనున్న ఎస్‌బీఐ!

న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన డోర్ స్టెప్ సేవలను మరింత విస్తరించడానికి సిద్ధమైంది.

Update: 2022-08-16 10:35 GMT

న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన డోర్ స్టెప్ సేవలను మరింత విస్తరించడానికి సిద్ధమైంది. కరోనా మహమ్మారి సమయంలో వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు డోర్-స్టెప్ సర్వీసులను ప్రారంభించింది. నేరుగా బ్యాంకులకు రాలేని సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడే వారికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, తాజాగా వికలాంగులుగా ఉన్న వినియోగదారులకు ఉచితంగా డోర్ స్టెప్ సేవలను అందించాలని నిర్ణయినట్టు ఎస్‌బీఐ ట్విటర్ ద్వారా పేర్కొంది.

నెలలో మూడు సార్లు ఉచితంగా ఈ సేవలను ఇవ్వనున్నట్టు వివరించింది. బ్యాంకు సేవలను పొందడానికి ఎంపిక చేసిన వినియోగదారుల ఇంటి వద్దకే ఎస్‌బీఐ సిబ్బంది వచ్చి అవసరమైన సేవలను అందిస్తారు. ప్రస్తుతానికి ఎస్‌బీఐ బ్యాంకు డెలివరీ, పికప్, ఇతర సేవల వంటి మూడు రకాల సేవలను అందిస్తోంది. ఇందులో క్యాష్ పికప్‌తో పాటు క్యాష్ డెలివరీ, చెక్‌లను అందుకోవడ, చెక్ కోసం అభ్యర్థించే స్లిప్, లైఫ్ సర్టిఫికేట్, కేవైసీ పత్రాలను అందుకోవడం, డ్రాఫ్ట్‌ల డెలివరీ, టర్మ్ డిపాజిట్ల డెలివరీ లాంటి సేవలను అందిస్తుంది. ఈ సేవలను పొందడానికి ఎస్‌బీఐ ఖాతాదారులు బ్యాంకు అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్, బ్రాంచుకు వెళ్లి దరఖాసు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి డోర్ స్టెప్ సేవల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఏ2 దేశీ ఆవు పాలను విడుదల చేసిన సిద్స్‌ ఫార్మ్‌ 

Tags:    

Similar News