అధిక వడ్డీ కావాలనుకుంటున్న వారికి ఇదే మంచి అవకాశం.. జూన్ 30 వరకే లాస్ట్ చాన్స్!
దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో దేశీయ, NRI వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని తీసుకొచ్చింది
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో దేశీయ, NRI వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దాని పేరు ‘అమృత్ కలాష్ డిపాజిట్ స్కీమ్’. ఈ పథకానికి సంబంధించి బ్యాంక్ కీలక విషయాన్ని ఇటీవల ప్రకటించింది. 400 రోజుల స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అందించే ఈ ప్లాన్ గడువు 2023 జూన్ 30తో ముగియనుంది. ఇది ఎక్కువ వడ్డీ ఆశించే వారి కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, 400 రోజుల ఈ ప్లాన్‌లో వడ్డీ రేట్లు సాధారణ ఖాతాదారులకు 7.10 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అదే సీనియర్ సిటిజన్‌లకు 7.60 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు 2023 ఏప్రిల్ 12 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పథకం చివరి తేదీ ఈ నెల(జూన్) 30 వరకు ఉంది.