Samsung కొత్త స్మార్ట్‌టీవీ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
దక్షిణకొరియా దిగ్గజం శామ్‌సంగ్ కొత్తగా మైక్రో LED TVని ఇండియాలో విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణకొరియా దిగ్గజం శామ్‌సంగ్ కొత్తగా మైక్రో LED TVని ఇండియాలో విడుదల చేసింది. దీని డిస్‌ప్లేలో ప్రత్యేకంగా నీలమణి గాజుతో తయారు చేసిన 24.8 మిలియన్ మైక్రోమీటర్-పరిమాణ LEDలను అమర్చారు. భారత్‌లో దీని ధర ఏకంగా రూ.1,14,99,000 (అక్షరాల కోటి పద్నాలుగు లక్షలకు పైనే). ఇది కంపెనీ సైట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. దీని డిస్‌ప్లే సైజు 110-అంగుళాలు. 120 FPS వద్ద 4 స్ట్రీమ్‌ల వరకు 4K డిస్‌ప్లేతో వచ్చింది. టీవీ M1 AI ప్రాసెసర్‌తో ఆధారితమైనది. మెరుగైన స్పష్టత, కాంట్రాస్ట్‌తో శక్తివంతమైన కలర్స్‌ను అందించే విధంగా దీన్ని తయారు చేశారు.
వినియోగదారులు సెకనుకు 120 ఫ్రేమ్‌ల వరకు ఏ వైపు నుంచి టీవీని చూసిన కంటెంట్‌ను క్లియర్‌గా చూడవచ్చు. ఇది ఆర్ట్ డిస్‌ప్లే వాల్‌గా మార్చగల యాంబియంట్ మోడ్+ ఫీచర్‌ను కలిగి ఉంది. టీవీ ఎడ్జ్‌లు స్లీమ్‌గా ఉంటాయి. ఇది OTS ప్రో, డాల్బీ డిజిటల్ ప్లస్, Q-సింఫనీకి మద్దతుతో 6.2.2 ఛానెల్‌లో 100W RMS సౌండ్ సిస్టమ్, మొబైల్ మిర్రరింగ్, Wi-Fi కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇన్‌బీల్ట్ యాప్‌లను కూడా దీనిలో అందించారు.