Rupee Value: ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి చేరుకున్న రూపాయి విలువ..!

దేశీయ కరెన్సీ రూపాయి విలువ(Rupee Value) మరింత క్షీణించింది.

Update: 2024-12-27 14:12 GMT
Rupee Value: ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి చేరుకున్న రూపాయి విలువ..!
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: దేశీయ కరెన్సీ రూపాయి విలువ(Rupee Value) మరింత క్షీణించింది. శుక్రవారం ఫారెక్స్‌ మార్కెట్లో అమెరికా డాలర్‌కు(US Dollar) అనూహ్యంగా డిమాండ్‌ పెరగడంతో రూపాయి విలువ ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి చేరుకుంది. గత కొన్నిరోజులుగా పడుతూ వస్తున్న రూపాయి మారకం విలువ ఈ రోజు మరో 25 పైసలు కోల్పోయి 85.52కి పతనమైంది. చివరి రెండేళ్లలో ఒకరోజులోనే రూపాయి విలువ అతిఘోరంగా పతనం అవ్వడం ఇదే మొదటిసారి. భారత ఎకానమీ(Indian Economy) గ్రోత్ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు(Crude Oil) భగ్గుమనడం, డాలర్‌ రేట్(Dollar Rate) బలోపేతం కావడం, ద్రవ్యోల్బణం(Inflation) పెరగడం వంటివి రూపాయి పై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. రూపాయి విలువ తగ్గుతుండటంతో రానున్న రోజుల్లో దిగుమతులకోసం 15 బిలియన్ డాలర్లు అధికంగా నిధులు వెచ్చించాల్సి ఉంటుందని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసర్చ్‌ ఇనిషివేటివ్‌(GTRI) వర్గాలు వెల్లడించాయి. దీంతో రూపాయి విలువ మరింత క్షీణించికుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) చొరవ తీసుకోవాలని పలువురు అభిప్రాయడుతున్నారు.

Tags:    

Similar News