కొత్త కంపెనీలకు మారేందుకు సిద్ధంగా 75 శాతం ఉద్యోగులు!

దేశవ్యాప్తంగా చాలామంది ఉద్యోగులు వివిధ కారణాలతో కొత్త ఉద్యోగాలకు మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఓ నివేదిక తెలిపింది.

Update: 2023-05-19 16:42 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చాలామంది ఉద్యోగులు వివిధ కారణాలతో కొత్త ఉద్యోగాలకు మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఓ నివేదిక తెలిపింది. మెరుగైన వేతనం, అనువైన ఆఫీసు వాతావరణం ఉన్న వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రముఖ గ్లోబల్ రిక్రూట్‌మెంట్ సంస్థ మైఖెల్ పేజ్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. ఏకంగా 98 శాతం మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం వెతుకుతున్నారని యాన్యువల్ టాలెంట్ ట్రెండ్స్-2023 నివేదిక స్పష్టం చేసింది.

అంతేకాకుండా కంపెనీ ప్రస్తుతం తమ ఉద్యోగుల్లో ప్రతి 10 మందిలో ఒకరిని మాత్రమే ఇతర ఉద్యోగాలకు వెళ్లకుండా నిలుపుకోగలవు. భారత్‌లో 4 వేల మంది వరకు ఉద్యోగుల వద్ద నుంచి మైఖెల్ పేజ్ వివరాలను సేకరించింది. గడిచిన 12-18 నెలల మధ్య కాలంలో చాలావరకు కార్యాలయాల్లో గణనీయ మార్పులు జరిగాయి.

75 శాతం మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగం కోసం వెతికే పనిలో ఉన్నట్లు చెప్పగా, 11 శాతం మంది మాత్రం రాబోయే ఆరు నెలల్లో కొత్త ఉద్యోగాలకు మారతామని స్పష్టం చేశారు. 23 శాతం మంది మెరుగైన అవకాశం ఉండే ఉద్యోగాల కోసం చూస్తున్నారు. ఆసక్తికరంగా 2022 లో ఉద్యోగాలు మారిన వారిలో కూడా 63 శాతం మంది ఈ ఏడాది మళ్లీ ఇంకొక కంపెనీకి మారే ప్రయత్నాలు చేస్తున్నారని నివేదిక వివరించింది.

Tags:    

Similar News