10 నెలల కనిష్టానికి మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం

ఆహార ద్రవ్యోల్బణం 8.66 శాతం నుంచి 8.52 శాతానికి తగ్గింది.

Update: 2024-04-12 14:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా నెమ్మదిస్తోంది. శుక్రవారం కేంద్ర గణాంకాలు, కార్యక్రం అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, మార్చిలో రిటైల్ ద్రవ్యల్బణం పది నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. ఫిబ్రవరిలో 5.09 శాతంగా ఉన్న వినియోగదారు ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం, గత నెలలో 4.85 శాతానికి దిగొచ్చింది. గతేడాది మార్చిలో సీపీఐ ద్రవ్యోల్బణం 5.66 శాతంగా నమోదైంది. గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 8.66 శాతం నుంచి 8.52 శాతానికి తగ్గింది. సమీక్షించిన నెలలో తృణధాన్యాల ధరలు 7.60 శాతం నుంచి 8.37 శాతం, మాంసం, చేపల ధరలు 6.36 శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో, కూరగాయలు, పప్పులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు, భారత పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) జనవరిలో 3.8 శాతం నుంచి ఫిబ్రవరిలో 5.7 శాతానికి పెరిగింది. ఇందులో విద్యుదుత్పత్తి 7.5 శాతం వృద్ధి చెందగా, మైనింగ్ ఉత్పత్తి 8 శాతం, తయరీ రంగం 5 శాతం పెరిగింది. 

Tags:    

Similar News