నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. అందుకే చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. మరీ ముఖ్యంగా మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా

Update: 2023-02-28 01:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ :  దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. అందుకే చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. మరీ ముఖ్యంగా మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ముందుగా కొనుగోలు చేసేది బంగారమే.కాగా, వారికి నేడు గుడ్ న్యూస్.

మంగళవారం మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధరపై రూ.150 తగ్గగా, గోల్డ్ ధర రూ.51,350గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.160 తగ్గగా, గోల్డ్ ధర రూ.56,020గా ఉంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. నేడు కేజీ వెండి ధరపై రూ.1000 తగ్గడంతో,రూ.69000లుగా వెండి ధర నమోదైంది.

Tags:    

Similar News