అన్‌సెక్యూర్డ్ రుణాల వాటా 20 శాతానికి పెంచే లక్ష్యం: ఆర్‌బీఎల్ బ్యాంక్!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రైవేట్ రంగ ఆర్‌బీఎల్ బ్యాంక్ వడ్డీ మార్జిన్‌ను 5.2 శాతానికి పెంచాలని భావిస్తున్నట్టు వెల్లడించింది.

Update: 2023-06-18 13:06 GMT

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రైవేట్ రంగ ఆర్‌బీఎల్ బ్యాంక్ వడ్డీ మార్జిన్‌ను 5.2 శాతానికి పెంచాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. తన లోన్ బుక్‌లో అధిక రాబడిని అందించే ఆస్తులను పెంచడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోనున్నట్టు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా బ్యాంకు రుణాల విభాగంలో క్రెడిట్ కార్డ్, మైక్రోఫైనాన్స్ వంటి అన్‌సెక్యూర్డ్ రుణాల వాటాను ప్రతి ఏటా 20 శాతానికి పెంచే లక్ష్యం నిర్దేశించామని బ్యాంకు సీనియర్ అధికారి ఆర్ సుబ్రమణ్యకుమార్ అన్నారు. ఈ ఏడాది మార్చి త్రైమాసికానికి బ్యాంకు నికర వడ్డీ మార్జిన్ 5 శాతానికి పైగా పెరిగింది.

ఈ ఏడాది చివరి నాటికి దాన్ని 5.2-5.3 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే, తాకట్టు రుణాలు, ఆస్తి రుణాలు, ద్విచక్ర, ఫోర్-వీలర్లపై రుణాల వంటి సెక్యూర్డ్ రిటైల్ రుణాల వాటాను కూడా పెంచనున్నామని సుబ్రమణ్యకుమార్ వివరించారు. రూ. 200 కొట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారాలకు రుణాలు ఇచ్చేందుకు, రూ. 40 కోట్ల వరకు క్రెడిట్ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు.


Similar News