Rs 2000 notes withdrawal: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ మరోసారి కీలక ప్రకటన చేసింది. 50 శాతం రూ.2 వేల నోట్లు వెనక్కి వచ్చాయని తెలిపింది. 85 శాతం డిపాజిట్ల రూపంలో, 15 శాతం క్యాష్ బదిలీ రూపంలో వెనక్కి వచ్చాయని పేర్కొంది.
దిశ, వెబ్‌డెస్క్: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ మరోసారి కీలక ప్రకటన చేసింది. 50 శాతం రూ.2 వేల నోట్లు వెనక్కి వచ్చాయని తెలిపింది. 85 శాతం డిపాజిట్ల రూపంలో, 15 శాతం క్యాష్ బదిలీ రూపంలో వెనక్కి వచ్చాయని పేర్కొంది. మార్పిడికి గడువు పెంచే అవకాశాలు లేవని మరోసారి స్పష్టం చేసింది. కేవలం ఎన్‌ఆర్‌ఐలకు మాత్రమే వెసులుబాటు కల్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రెండు వేల రూపాయల నోట్లను మార్కెట్ చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించాక, పింక్ నోట్ డిపాజిట్లు బ్యాంకులను ముంచెత్తాయి.
రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసిన 2016 నాటి తరహాలో కాకుండా, ఈసారి బ్యాంకుల్లోకి పెద్ద నోట్ల రాకలో వేగం, పరిమాణం చాలా ఎక్కువగా పెరిగింది. ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ప్రకటించగా, మార్చుకోవడానికి ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆర్‌బీఐ గడువు ఇచ్చింది. అయితే, ఇటీవల గడువు పెంచే అవకాశాలు ఉన్నాయని పలు మీడియా ఛానళ్లలో వార్తలు ప్రచురితం అవుతుండటంతో ఆర్బీఐ స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో గడువు పెంచే అవకాశం లేదని తేల్చి చెప్పిది.
Jan Aushadhi :రూ.5 వేలు పెడితే చాలు.. ప్రతి నెల రూ.50 వేల వరకు సంపాదించుకోవచ్చు
Pradhan Mantri Matru Vandana Yojana :ఆడపిల్లలను కన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్