మీ దగ్గర రూ.500 రూపాయల నోట్స్ ఉన్నాయా.. అయితే ఒకసారి చెక్ చేయండి, ఈ గుర్తు ఉంటే అవి నకిలీ నోట్లేనంట!

మీ దగ్గర రూ.500 నోట్లు ఉన్నాయా? అయితే మీ కోసమే ఈ సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ప్రచారం అవుతోంది. ఇలాంటి గుర్తు ఉన్న నోట్లన్నీ నకిలీ నోట్లు అంటూ పెద్ద ఎత్తున ఓ వార్త సర్క్యూలెట్

Update: 2024-07-16 16:49 GMT

దిశ, ఫీచర్స్ : మీ దగ్గర రూ.500 నోట్లు ఉన్నాయా? అయితే మీ కోసమే ఈ సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ప్రచారం అవుతోంది. ఇలాంటి గుర్తు ఉన్న నోట్లన్నీ నకిలీ నోట్లు అంటూ పెద్ద ఎత్తున ఓ వార్త సర్క్యూలెట్ అవుతోంది. కాగా, ఆ ప్రచారానికి పీఐబీ చెక్ పెట్టింది.

కొందరు స్టార్ట్ సింబల్ ఉన్న ఐదు వందల నోట్లు మీ వద్ద ఉన్నాయా? అయితే అవన్నీ నకిలీ నోట్స్ అంటూ తెలుపుతూ ఓ వార్తను తెగ వైరల్ చేశారు. దీంతో కొంత మంది అయోమయానికి గురి అయ్యారు. ఇంకొంత మంది స్టార్ గుర్తున్న నోట్లు నకిలీవి, చెల్లినివి ఇన్నీ నోట్స్ పనికిరావా అంటూ ఆందోళనకు గురి అయ్యారు. దీంతో ఈ వార్తలపై ఆర్బీఐ క్లారిటీ ఇస్తూ.. ఆ స్టార్ గుర్తు గురించి తెలిపింది. స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోటు నకిలీవి కావని తేల్చి చెప్పింది. ఈ నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నవే, ఈ నోట్లు 2016 డిసెంబర్‌లో జారీ చేసినవి. ఈ ఐదువందల నోటు వెనుక భాగంలో అప్పటి గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో భాటు, స్వచ్ఛత్ భారత్ లోగో, ప్రిఫిక్స్, నంబర్ మధ్య కాలీ ప్లేస్‌లో అదనపు అక్షరం స్టార ఉంటుంది. ఇవి ఇతర నోట్లు అన్నీ ఒకటే కానీ ఈ స్టార్ సింబల్స్ కొన్ని నోట్లకు మాత్రమే ఉంటాయి. ఇలా స్టార్ గుర్తు ఉన్న ఐదువందల నోట్లు రీ ప్లేస్ చేసినవి, పునర్ ముద్రించిన నోట్లు వాటిని గుర్తించడానికి స్టార్ సింబల్ ఉంటుంది. దీని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆ నోట్లు అన్నీ పని చేస్తాయి. ఎవరూ ఫేక్ వార్తలను నమ్మకూడదు అంటూ తెలిపింది.


Similar News