Fintech Sector: ఫిన్‌టెక్ రంగం స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి: ఆర్‌బీఐ గవర్నర్

స్వీయ నియంత్రణ మూలంగా పరిశ్రమలో సవాళ్లు, అవకాశాలపై అవగాహన స్పష్టంగా ఉంటుందన్నారు.

Update: 2024-08-28 16:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో వేగంగా పెరుగుతున్న ఫిన్‌టెక్ రంగంలో మెరుగైన నియంత్రణను కొనసాగించేందుకు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. బుధవారం ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్న ఆయన.. ఫిన్‌టెక్ రంగం స్థిరంగా అభివృద్ధి చెందాలంటే ఆవిష్కరణలు, దూరదృష్టి విషయంలో సమతుల్యత అవసరం. దీనికోసం స్వీయ నియంత్రణ ఖచ్చితంగా కావాలి. స్వీయ నియంత్రణ మూలంగా పరిశ్రమలో సవాళ్లు, అవకాశాలపై అవగాహన స్పష్టంగా ఉంటుందన్నారు. అంతేకాకుండా ఫిన్‌టెక్ రంగానికి సంబంధించి ఐదు కీలక ప్రాధాన్యతలపై మాట్లాడుతూ.. డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ అండ్ సైబర్ సెక్యూరిటీ, సస్టైనబుల్ ఫైనాన్స్, గ్లోబల్ ఇంటిగ్రేషన్ అండ్ కోపరేషన్ ఉండాలన్నారు. అలాగే, క్రాస్-బోర్డర్ పేమెంట్ సిస్టమ్స్ సహా ఆర్థిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కీలకమని దాస్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News