100 కోట్ల రైడ్‌లను పూర్తి చేసిన రాపిడో

ప్రముఖ రైడ్ హెయిలింగ్ కంపెనీ రాపిడో కీలక మైలురాయికి చేరుకున్నట్లు ప్రకటించింది.

Update: 2024-04-04 10:52 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ రైడ్ హెయిలింగ్ కంపెనీ రాపిడో కీలక మైలురాయికి చేరుకున్నట్లు ప్రకటించింది. ఆటో, బైక్-టాక్సీ, క్యాబ్ సేవలను అందించే సంస్థ 120 నగరాల్లో 100 కోట్ల రైడ్‌లను పూర్తి చేసినట్లు గురువారం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో సేవలు అందిస్తున్న కంపెనీ గిగ్ వర్కర్లకు ఉపాధి అవకాశాలను అందించే వేదికగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ప్రస్తుతం చాలా మంది దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరవేయడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 100 కోట్ల రైడ్‌లను పూర్తి చేయడం నిజంగా చాలా సంతోషించే విషయం. ఈ మైలురాయి లెక్కలేనన్ని జీవితాలను స్పృశించడం, సాధికారత పొందిన కమ్యూనిటీలను సూచించడమే కాకుండా ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న 'విక్షిత్ భారత్'ను ప్రోత్సహించడంలో మా నిబద్ధతను కూడా నొక్కి చెబుతుందని రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి అన్నారు. రాపిడో 2015 లో బెంగళూరులో ప్రారంభమైంది. ప్రధానంగా బైక్ టాక్సీ సేవలను అందిస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టగా ప్రస్తుతం ఆటో రిక్షా, టాక్సీ క్యాబ్, సరుకు రవాణా లాంటి రంగాల్లో కూడా విస్తరించింది.


Similar News