Apple iPhone 15 Series : ఐఫోన్ 15 సిరీస్ లాంచ్.. పాత మోడల్స్ ధరల తగ్గింపు!

యాపిల్ కంపెనీ ఇటీవల తన కొత్త మోడల్ iPhone 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను 'వండర్‌లస్ట్' ఈవెంట్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Update: 2023-09-14 04:38 GMT
Apple iPhone 15 Series : ఐఫోన్ 15 సిరీస్ లాంచ్.. పాత మోడల్స్ ధరల తగ్గింపు!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: యాపిల్ కంపెనీ ఇటీవల తన కొత్త మోడల్ iPhone 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను 'వండర్‌లస్ట్' ఈవెంట్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే కొత్త మోడల్స్ విడుదల చేసిన తర్వాత యాపిల్ సాధారణంగా తన పాత మోడల్‌ల ధరలను తగ్గిస్తుంది. ఐఫోన్ 14, 14 Plus, 13 ధరలు తగ్గే అవకాశం ఉంది. కొత్త మోడల్ లాంచ్‌కు ముందు ఈ ఫోన్ల ధరలు తగ్గగా, ప్రస్తుతం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. కొత్తగా అప్‌డేట్ చేసిన ధరలు యాపిల్ కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు ఈ కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.

వినియోగదారులు ఈ ధరల తగ్గింపు గురించి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు కొనుగోలు సైట్లను చెక్ చేస్తూ ఉండాలి. అమెజాన్‌లో ప్రస్తుతం iPhone 14 బేస్ వేరియంట్ 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.65,999 గా ఉంది, లాంచ్ టైంలో ఈ ఫోన్ ధర రూ.79,900. ఐఫోన్ 14 ప్లస్ బేస్ వేరియంట్ ధర రూ. 76,990 గా ఉంది. లాంచ్ టైంలో దీని అసలు ధర రూ.89,900. అలాగే కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై తగ్గింపులు కూడా ఉన్నాయి.

Tags:    

Similar News