Power Mech-Adani Power: అదానీ పవర్ నుంచి రూ.510 కోట్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న పవర్ మెక్ ప్రాజెక్ట్స్
హైదరాబాద్(HYD)కు చెందిన ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(Infrastructure) సంస్థ పవర్ మెక్ ప్రాజెక్ట్స్(Power Mech Projects) అదానీ గ్రూప్(Adani Group) యాజమాన్యంలోని అదానీ పవర్(Adani Power) నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కించుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(HYD)కు చెందిన ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(Infrastructure) సంస్థ పవర్ మెక్ ప్రాజెక్ట్స్(Power Mech Projects) అదానీ గ్రూప్(Adani Group) యాజమాన్యంలోని అదానీ పవర్(Adani Power) నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు విలువ రూ. 510 కోట్లని పవర్ మెక్ పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రం రాయ్ పూర్(Raipur)లో ఉన్న అదానీ పవర్ లోని 3600 మెగా వాట్ల ఫేజ్-2 అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(Thermal Power Project)లో మెకానికల్ నిర్మాణ(Mechanical construction) పనులు చేయాల్సి ఉందని తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్(Exchange Filing)లో తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ను 34 నెలల్లో కంప్లీట్ చేయాలని పవర్ మెక్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా పవర్ మెక్ ప్రాజెక్ట్స్ 1999లో స్థాపించబడింది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ తో ముగిసిన రెండో త్రైమాసికంలో సంస్థ 69.51 కోట్ల నికర ఆదాయాన్ని నమోదు చేసింది. దీంతో కంపెనీ కార్యకలాపాల ఆదాయం మొత్తంగా రూ. 1,035.49 కోట్లకు చేరుకుంది.