చాట్‌జీపీటీ ఉద్యోగాలను భర్తీ చేయలేదు: టీసీఎస్!

చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధస్సు ఉద్యోగాలకు సహాయంగా మాత్రమే పనికొస్తాయని, అవి ఉద్యోగాలను భర్తీ చేయలేవని దేశీయ టెక్ సేవల దిగ్గజం టీసీఎస్ అభిప్రాయపడింది.

Update: 2023-02-26 13:01 GMT

ముంబై: చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధస్సు ఉద్యోగాలకు సహాయంగా మాత్రమే పనికొస్తాయని, అవి ఉద్యోగాలను భర్తీ చేయలేవని దేశీయ టెక్ సేవల దిగ్గజం టీసీఎస్ అభిప్రాయపడింది. ఇలాంటి సాధనాలు ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు సహాయపడతయని, అయితే కంపెనీల వ్యాపార మూలాలను మార్చలేవని టీసీఎస్ హెచ్ఆర్ అధికారి మిలింద్ లక్కడ్ అన్నారు. చాట్‌జీపీటీ వంటి అత్యాధునిక టెక్ పనితనం వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలకు గండి పడుతుందనే ఊహాగానాల మధ్య ఆయన స్పందించారు.

ఏఐ టెక్నాలజీ ఎప్పుడైనా సరే సహోద్యోగిగా మాత్రమే ఉండగలదు. వినియోగదారుల అవసరాన్ని అర్థం చేసుకుని, ఏఐ సాయంతో పరిష్కారాలను అందించడానికి మాత్రమే వీలవుతుందని మిలింద్ ఓ ప్రకటనలో తెలిపారు. కానీ, ఉద్యోగాలను ఈ చాట్‌జీపీటీ వంటిని భర్తీ చేయకపోయినప్పటికీ ఆయా ఉద్యోగ స్థాయిల నిర్వచనాల్లో మార్పులకు కారణమవుతాయని ఆయన వివరించారు. ఇలాంటి టెక్ ప్లాట్‌ఫామ్‌లు నిర్వహణ అవసరాలను తగ్గించగలవు కానీ ఉద్యోగుల డిమాండ్‌ను ప్రభావితం చేయలేవు. ఉత్పాదకత, తక్కువ సమయంలో పని పూర్తి చేయడంలో స్థిరత్వాన్ని మెరుగుపరచగలవని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News