148 శాతం పెరిగిన ఈవీ అమ్మకాలు!
గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం వాహనాల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా... peak sales in March, total EV registrations grow to 1.18 mn in FY23
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం వాహనాల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 5 శాతంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఈవీ అమ్మకాలు 11.8 లక్షల యూనిట్లను దాటాయి. ప్రధానంగా టూ-వీలర్, త్రీవీలర్ విక్రయాలు గణనీయంగా పుంజుకోవడంతో ఏడాది ప్రాతిపదికన ఈవీ అమ్మకాలు 148 శాతం పెరిగాయి. ప్రభుత్వ వాహన్ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మార్చిలో 1,40,509 యూనిట్ల రిటైల్ అమ్మకాలు నమోదయ్యాయి. మొత్తం విక్రయాల్లో 86,136 ఎలక్ట్రిక్ టూ-వీలర్లు, 46,941 యూనిట్ల త్రీ-వీలర్లు, 7.345 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లు(కమర్షియల్ వాహనాలతో సహా), 87 ఈ-బస్సుల అమ్మకాలు నమోదయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారం కావడం, ఈవీ విభాగంలో కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తుండటం, ఈవీలకు తక్కువ ఖర్చు కావడం, దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాల లభ్యత పెరగడం వంటి పరిణామాలతో రానున్న రోజుల్లో ఈవీ వృద్ధి మరింత వేగవంతంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత స్థాయిలలోనే అమ్మకాలు కొనసాగితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈవీలు 20 లక్షల యూనిట్ల మార్కును అధిగమిస్తాయని సెంటర్ ఫర్ ఎనర్జీ ఫైనాన్స్ డైరెక్టర్ గగన్ సిద్ధు పేర్కొన్నారు.