ఈ-కామర్స్ కంపెనీల తో లక్షన్నర చిన్న దుకాణాలు మూతబడ్డాయి: సీఏఐటీ!

న్యూఢిల్లీ: బడా సంస్థల వ్యాపార విధానం, వాటి వ్యాపార పనితీరుపై సమర్థవంతమైన తనిఖీ లేకపోవడం కారణంగా భారత్‌లో ఇప్పటివరకు 1.5 లక్షాల చిన్న దుకాణాలు మూసివేయబడ్డాయని వ్యాపారుల సమాఖ్య ఓ ప్రకటనలో వెల్లడించింది.

Update: 2022-08-21 16:48 GMT

న్యూఢిల్లీ: బడా సంస్థల వ్యాపార విధానం, వాటి వ్యాపార పనితీరుపై సమర్థవంతమైన తనిఖీ లేకపోవడం కారణంగా భారత్‌లో ఇప్పటివరకు 1.5 లక్షాల చిన్న దుకాణాలు మూసివేయబడ్డాయని వ్యాపారుల సమాఖ్య ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలోని 8 కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిధ్య వహిస్తున్న ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ), చిన్న వ్యాపారులను కాపాడేందుకు రిటైల్ రంగంలో సమగ్రమైన విధానం, వాణిజ్య కార్యకలాపాలను పర్యవేక్షించే నియంత్రణ అత్యవసరమని పేర్కొంది. దేశంలోని ఈ-కామర్స్ కంపెనీలు అందించే డిస్కౌంట్లు, ఇతర ధరల విధానాల వల్ల చిన్న వ్యాపారులు ఎక్కువ ప్రభావితమవుతున్నారు.

ఈ కంపెనీలు చట్టవిరుద్ధమైన వస్తువుల కొనుగోళ్లు, నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించడం ద్వారా జీఎస్టీ, ఆదాయపు పన్నులను పెద్ద ఎత్తున ఎగవేశాయి. కానీ వాటిపై ఎలాంటి చర్యలు ఇంకా తీసుకోలేదు. ఈ పరిణామాల వల్ల దేశీయ రిటైల్ వ్యాపారాలు దెబ్బతిన్నాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ఇదే సమయంలో దాదాపు నాలుగేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ-కామర్స్ పాలసీ ఇంకా అమలు చేయబడలేదని వ్యాపారుల సమాఖ్య అభిప్రాయపడింది.

Tags:    

Similar News