OnePlus: వన్‌ప్లస్ కీలక నిర్ణయం.. ఇకపై గ్రీన్‌లైన్‌ సమస్యకు చెక్..!

చైనా(China)కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్(OnePlus) స్మార్ట్‌ఫోన్లలో గత కొంత కాలంగా గ్రీన్‌లైన్లు(Greenlines) వస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-08 03:18 GMT
OnePlus: వన్‌ప్లస్ కీలక నిర్ణయం.. ఇకపై గ్రీన్‌లైన్‌ సమస్యకు చెక్..!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్(OnePlus) స్మార్ట్‌ఫోన్లలో గత కొంత కాలంగా గ్రీన్‌లైన్లు(Greenlines) వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ అప్డేట్(Update) చేసిన తర్వాత డిస్‌ప్లేపై గ్రీన్ కలర్(Green Colour)లో కొన్ని లైన్స్ నిలువుగా దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ సమస్యకు చెక్ పెట్టేలా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అమోలెడ్ డిస్‌ప్లే(AMOLED Display) ఫోన్లలో తలెత్తుతున్న గ్రీన్‌లైన్ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేకమైన 'గ్రీన్‌లైన్ వర్రీ ఫ్రీ సొల్యూషన్'ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియాలోని వన్‌ప్లస్ యూజర్లకు లైఫ్‌టైమ్ వారంటీ(Lifetime Warranty)ని అందించనుంది.

దీంతో పాటు ఈ సమస్యను పూర్తిగా నివారించేందుకు మరో రెండు కీలక చర్యలను తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇండియాలో హీట్(Heat), తేమ(Humidity) వల్ల గ్రీన్‌లైన్ ఇష్యూ రాకుండా స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలకు పీవీఎక్స్ లేయర్(PVC layer) జోడించనుంది. అలాగే తమ ఫోన్లను 85 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 85 శాతం తేమ వాతావరణంలో పరీక్షించేందుకు 80 రకాల క్వాలిటీ కంట్రోల్(Quality control) పరీక్షలు నిర్వహించనుంది. కాగా వచ్చే సంవత్సరం జనవరిలో వన్‌ప్లస్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేయనున్న నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకోవడం విశేషం. 

Tags:    

Similar News