NTPC Green Energy IPO: నవంబర్ 19 నుంచి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ.. సబ్‌స్క్రిప్షన్ తేదీ, షేరు ధర వివరాలివే..!
ప్రభుత్వ రంగ దిగ్గజం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ(NTPC Green Energy) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చేందుకు సిద్దమైంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ దిగ్గజం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ(NTPC Green Energy) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చేందుకు సిద్దమైంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఐపీవో ద్వారా సుమారు రూ. 10,000 కోట్లను సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 19న ప్రారంభమై 22 వరకు కొనసాగనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక రోజు ముందుగానే బిడ్డింగ్ విండో తెరుచుకోనుంది. ఒక్కో ఈక్విటీ షేరు ధరను కంపెనీ రూ. 102- రూ.108గా ఖరారు చేసింది. 138 షేర్లను కలిపి ఒక్కో లాట్ సైజు గా నిర్ణయించారు. కాగా ఐపీఓ ద్వారా జారీ చేసే షేర్లలో 75 శాతం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం చొప్పున రిజర్వు చేశారు. కాగా సబ్‌స్క్రిప్షన్ లో కంపెనీ ఉద్యోగులకు స్పెషల్ రిజర్వేషన్(Special Reservation)తో పాటు డిస్కౌంట్(Discount) ఉంటుందని ఎన్టీపీసీ తెలిపింది.