ఇండియాలో పెట్టుబడులపై ఎలాంటి ఒప్పందాలు కుదర్చుకోలేదు: ఫాక్స్‌కాన్

భారత్‌లో కొత్త పెట్టుబడులపై తైవానీస్ టెక్ దిగ్గజం ఫాక్స్‌కాన్ సంస్థ శనివారం కీలక ప్రకటన చేసింది.

Update: 2023-03-04 06:42 GMT

బెంగళూరు: భారత్‌లో కొత్త పెట్టుబడులపై తైవానీస్ టెక్ దిగ్గజం ఫాక్స్‌కాన్ సంస్థ శనివారం కీలక ప్రకటన చేసింది. ఫాక్స్‌కాన్ ఛైర్మన్, సీఈఓ యంగ్ లియు ఫిబ్రవరి 27 నుండి మార్చి 4 వరకు భారత్‌లో జరిగిన పర్యటనలో కొత్త పెట్టుబడులకు సంబంధించిన ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని కంపెనీ ప్రకటించింది. యాపిల్ ఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్ కంపెనీ చైనా నుంచి తమ పెట్టుబడులను మళ్లించి భారత్‌లో పెడుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ మీడియాలో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవం లేదని, కొత్త పెట్టుబడుల గురించి ఎలాంటి కచ్చితమైన ఒప్పందాలు కుదర్చుకోలేదు, ఈ చర్చలు అంతర్గతంగా కొనసాగుతున్నాయని ఫాక్స్‌కాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ, ఫాక్స్‌కాన్ రెండు కంపెనీలు కూడా చైనాకు వెలుపల పెట్టుబడులు పెడుతున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. అయితే నిన్న కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్. బొమ్మై యాపిల్ కంపెనీ రాష్ట్రంలోని కొత్తగా $700 మిలియన్ కొత్త ప్లాంట్ పెడుతున్నట్లు ప్రకటించారు. అలాగే దీని ద్వారా సుమారు లక్ష ఉద్యోగాలు వస్తాయని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News