7 వేలకు పైగా 'బలెనో' మోడల్ కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకి!
దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి భారీ సంఖ్యలో తన హ్యాచ్బ్యాక్ మోడల్ బలెనో కార్లను రీకాల్ చేసింది.
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి భారీ సంఖ్యలో తన హ్యాచ్బ్యాక్ మోడల్ బలెనో కార్లను రీకాల్ చేసింది. వాక్యూమ్ పంప్లో లోపం కారణంగా 7,213 బలెనో ఆర్ఎస్ మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 2016, అక్టోబర్ 27 నుంచి 2019, నవంబర్ 1వ తేదీ మధ్య కాలంలో తయారైన బలెనో ఆర్ఎస్ కార్లలో లోపం ఉన్నట్లు మారుతీ సుజుకి గుర్తించింది. బ్రేక్ వేసేందుకు సహాయపడే వాక్యూమ్ పంప్లో లోపం వల్ల కొన్ని సందర్భాల్లో బ్రేక్ వేసేందుకు ప్రయాణీకులు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. లోపం ఉన్నట్లు గుర్తించిన వాహనాలకు సంబంధించి కంపెనీయే స్వయంగా వినియోగదారులను సంప్రదించి ఉచితంగా విడిభాగాలను మార్చనున్నట్టు మారుతీ సుజుకి పేర్కొంది.
Also Read...