L&T: ఎన్టీపీసీ నుంచి భారీ కాంట్రాక్టు దక్కించుకున్న ఎల్ అండ్ టీ
ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ లార్సెన్ అండ్ టూబ్రో(L&T) మంగళవారం కీలక ప్రకటన చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ లార్సెన్ అండ్ టూబ్రో(L&T) మంగళవారం కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్(MP), బీహార్(Bihar)లో థర్మల్ పవర్ ప్లాంట్లు(Thermal Power Plants) ఏర్పాటు చేయడానికి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) నుంచి భారీ కాంట్రాక్టు దక్కించుకున్నట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో తెలిపింది. ఈ కాంట్రాక్టు విలువ దాదాపు రూ. 15,000 కోట్లుగా ఉంటుందని పేర్కొంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని గదర్వారా(Gadarwara) వద్ద 1600 మెగావాట్ల స్టేజ్-2 థర్మల్ పవర్ ప్లాంట్, అలాగే బీహార్‌లోని నబీనగర్(Nabinagar)లో 2400 మెగావాట్ల స్టేజ్-2 థర్మల్ పవర్ ప్లాంట్ ను L&T ఏర్పాటు చేయనుంది. ఈ కాంట్రాక్టు లో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ వర్క్స్ తో పాటు బాయిలర్లు, టర్బైన్స్, యాక్సిలరీల డిజైన్, సప్లై తదితర పనులు ఉన్నాయి. కాగా ప్రస్తుతం L&T మార్కెట్ విలువ 27 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంస్థకు ఇంజనీరింగ్, ప్రొక్యూర్ మెంట్, కన్ స్ట్రక్షన్ రంగాలలో బిజినెస్ లు ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో ఈ సంస్థ విస్తరించి ఉంది.