LIC అదిరిపోయే ప్లాన్.. ప్రతి నెలా రూ. 11 వేలకు పైగా పొందొచ్చు

పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందుతూ హాయిగా గడపాలనుకునే వారికి దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఒక శుభవార్త అందించింది.

Update: 2023-01-09 11:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందుతూ హాయిగా గడపాలనుకునే వారికి దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఒక శుభవార్త అందించింది. ఇటీవల న్యూ జీవన్ శాంతి ప్లాన్(New Jeevan Shanti Plan) ప్లాన్‌‌ను తెచ్చింది. ప్రస్తుతం దీని యాన్యుటీ రేటును పెంచింది. జనవరి 5 తర్వాత ఈ పెరిగిన యాన్యుటీ రేటును పాలసీ దారులు పొందుతారు. రూ. 1000 కొనుగోలు ధరకు, ఎంచుకున్న వాయిదా వ్యవధి ఆధారంగా రూ. 3 నుంచి రూ. 9.75 వరకు ఇన్సెంటివ్ ఉంటుంది. ఇది నాన్ లింక్డ్ ప్లాన్. ఒకేసారి ప్రీమియం చెల్లించాలి. తర్వాత ప్రతినెలా జీవితాంతం మీ అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి. యాన్యుటీ రేట్లను సవరించడం ద్వారా పాలసీ దారులు మంచి ఆదాయం పొందవచ్చు.


ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 30 ఏళ్లు. గరిష్ట వయస్సు 79 ఏళ్లు. కనీస ప్రీమియం రూ.1.5 లక్షలు. గరిష్ట ప్రీమియం పరిమితి లేదు. రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా రూ. 11,192 నెలవారీ పెన్షన్ పొందొచ్చు. పాలసీదారుడు మరణిస్తే నామినీకి డబ్బులు వస్తాయి. అలాగే, దీనిలో జాయింట్ అకౌంట్ కూడా ఉంది. ఈ అకౌంట్ హోల్డర్లకు యాన్యుటీలో ఒకరు మరణిస్తే మరొకరికి పెన్షన్ వస్తుంది. ఎంచుకున్న విధంగా అర్ధ-వార్షిక, త్రైమాసిక, నెలవారీగా డబ్బులు చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం LIC వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

ఇవి కూడా చదవండి : భారీ లాభాలను సాధించిన స్టాక్ మార్కెట్లు!

Tags:    

Similar News