త్వరలో జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు!
రిలయన్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో సినిమా త్వరలో ప్రీమియం సేవలను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: రిలయన్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో సినిమా త్వరలో ప్రీమియం సేవలను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఉచిత స్ట్రీమింగ్ ద్వారా భారీగా ఆదరణ పొందిన జియో సినిమా ప్లాట్‌ఫామ్‌పై చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించవచ్చని, తద్వారా వినియోగదారులు కొత్త సినిమాలు, మ్యూజిక్ సహా ఇతర కంటెంట్ సేవలు పొందుతారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఇటీవల ఓ ప్రకటనలో రిలయన్స్ ఐపీఎల్‌ను ఉచితంగా అందిస్తూనే, కొత్తగా తీసుకురాబోయే కంటెంట్‌కు రుసుమును వసూలు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో జియో ప్రకటించే ప్లాన్‌ల గురించి వార్తలు వినిపిస్తున్నాయి. డైలీ, గోల్డ్, ప్లాటినమ్ వంటి మూడు పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను తీసుకురానున్నట్టు సమాచారం. అందులో డైలీ ప్లాన్‌లో భాగంగా రోజుకు రూ. 2తో జియో సేవలందించనుంది. దీనిద్వారా రెండు డివైజ్‌లలో ఒకేసారి చూసే వీలుంటుంది.
గోల్డ్ ప్లాన్‌ను డిస్కౌంట్ కింద రూ. 99 గా నిర్ణయించగా, మూడు నెలల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో కూడా ఒకేసారి రెండు డివైజ్‌లలో చూడవచ్చు. ఇక, ప్రీమియం ప్లాన్‌ను రూ. 599కే అందిస్తూ, ఏడాది వ్యాలిడిటీ ఇవ్వనుంది. ఈ ప్లాన్ ఎంచుకుంటే ఒకేసారి నాలుగు డివైజ్‌లలో జియో సినిమా లాగ్-ఇన్ కావొచ్చు. కాగా, చెల్లింపుల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల గురించి రిలయన్స్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Also Read..
హైదరాబాద్‌లో కొత్తగా మరో రెండు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించిన Ola