Jio: ఇంటి నుంచే సిమ్ యాక్టివేట్ చేసుకునే సదుపాయం తెచ్చిన జియో
'ఐయాక్టివేట్' పేరుతో సేవలను తీసుకొచ్చింది.
దిశ, బిజినెస్ బ్యూరో: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో వినియోగదారుల కోసం కొత్త రకం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా సిమ్ కార్డు తీసుకునే వారు ఇకపై జియో స్టోర్‌కు వెళ్లి యాక్టివేట్ చేసుకోవాల్సిన పనిలేకుండా ఇంటి వద్దే ఉండి చేసుకునేలా సదుపాయం ప్రారంభించింది. అందుకోసం 'ఐయాక్టివేట్' పేరుతో సేవలను తీసుకొచ్చింది. ఇప్పటికే జియో సిమ్ కార్డులను ఉచితంగానే ఇంటికి డెలివరీ చేస్తుండగా, దీన్ని అప్‌గ్రేడ్ చేస్తూ ఐయాక్టివేట్ ద్వారా ఎక్కడి నుంచైనా కొత్త సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఫోన్ కస్టమర్లు స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. దీనికోసం మైజియో యాప్ నుంచి ఐయాక్టివేట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలని, అందులో ఫిజికల్ సిమ్, ఈ-సిమ్ ఎంచుకుని, తగిన వివరాలు ఇచ్చిన తర్వాత ఓటీపీ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డాక్యుమెంట్ల అప్‌లోడ్‌తో ప్రక్రియ పూర్తవుతుందని జియో తన ప్రకటనలో వివరించింది. ఈ ప్రక్రియను జియో డెలివరీ ఏజెంట్ సాయం ద్వారా కూడా పూర్తి చేయవచ్చని పేర్కొంది.