Insurance Sector: బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలు రావాలి: ఐఆర్‌డీఏఐ చైర్మన్

2027 నాటికి దేశంలోని అందరికీ బీమా అనే లక్ష్యాన్ని చేరుకునేందుకు చాలా మూలధనం అవసరమని ఆయన పేర్కొన్నారు

Update: 2024-11-08 17:00 GMT
Insurance Sector: బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలు రావాలి: ఐఆర్‌డీఏఐ చైర్మన్
  • whatsapp icon

దిశ, బిజినెస్ బ్యూరో: బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావాలని ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ దెబాశిష్ పాండా అన్నారు. 2027 నాటికి దేశంలోని అందరికీ బీమా అనే లక్ష్యాన్ని చేరుకునేందుకు చాలా మూలధనం అవసరమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రధానంగా బీమా పరిశ్రమ మూలధన నిధులతో నడిచే రంగం. దీని విస్తరణ మరింత పెంచేందుకు మరిన్ని కంపెనీలు రావాల్సిన అవసరమన్నారు. పరిశ్రమకు ఇంకా నిధులు అవసరం ఉంది. దానికోసం కొత్త సంస్థలు రావాలి. ఈ క్రమంలో సవాళ్లు ఎదురైనప్పటికీ పరిశ్రమలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించేందుకు ఇది సరైన సమయమని దెబాశిష్ పాండా అన్నారు. కాగా, 2000 ఏడాది భారత్‌లో మొదటిసారి ప్రైవేటు, విదేశీ పెట్టుబడులకు అనుమతులు వచ్చాయి. ప్రస్తుతం సాధారణ, జీవిత, ఆరోగ్య బీమా పరిశ్రమలో 74 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులున్నాయి.  

Tags:    

Similar News