ఉద్యోగులకు అదిరిపోయే భారీ కానుకను ఇవ్వనున్న Infosys!
దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు భారీ కానుకను ఇవ్వనుంది.
ముంబై: దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు భారీ కానుకను ఇవ్వనుంది. 2015 స్టాక్ ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్ ద్వారా ఉద్యోగులకు రూ. 64 కోట్ల విలువైన షేర్లను కేటాయించినట్టు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. అందులో భాగంగా ప్రస్తుత మార్కెట్ విలువ కింద 5,11,862 ఈక్విటీ షేర్లను ఉద్యోగులకు కేటాయించింది.
2015 స్టాక్ ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్ ద్వారా 1,04,335 ఈక్విటీ షెర్లు, ఇన్ఫోసిస్ ఎక్స్‌పాండెడ్ స్టాక్ ఓనర్‌షిప్ ప్రోగ్రామ్-2019 కింద 4,07,527 ఈక్విటీ షేర్లను కేటాయించామని కంపెనీ వివరించింది. ఈ నిర్ణయంతో కంపెనీ షేర్ కేపిటల్ రూ. 2,074.9 కోట్లకు చేరనుంది. ఇన్ఫోసిస్ ఎక్స్‌పాండెడ్ స్టాక్ ఓనర్‌షిప్ ప్రోగ్రామ్-2019 కింద పొందే షేర్లకు ఎటువంటి లాక్-ఇన్ పీరియడ్ ఉండదు.
ఈ ప్రోగ్రామ్ ఉద్దేశ్యం ఉద్యోగుల ప్రతిభను ప్రోత్సహించడం, వారిని సంస్థ నుంచి బయటకు వెళ్లకుండా నిలుపుకోవడం, ఉద్యోగుల యాజమాన్యాన్ని విస్తరించడం. ఇన్ఫోసిస్‌లో ఉన్న ఉద్యోగులందరూ ఈ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. ఈ పథకం కింద ఉద్యోగులకు వారి అర్హత, పనితీరు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈక్విటీ షేర్లను కేటాయించడం జరుగుతుంది.