స్వల్పంగా పెరిగిన భారత ఎగుమతులు

ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, మాంసం, పాల ఉత్పత్తులు, పండ్లు, సిరామిక్, కూరగాయల ఎగుమతులు అధికంగా జరగడం ఇందుకు దోహదపడ్డాయి.

Update: 2024-01-21 10:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాదికి సంబంధించి భారత ఎగుమతులు స్వల్పంగా మాత్రమే పెరిగాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశ వస్తు, సేవల ఎగుమతులు పెరగడం గమనార్హం. వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 2023లో భారత ఎగుమతులు 0.4 శాతం పెరిగి రూ. 62.89 లక్షల కోట్ల(765.6 బిలియన్ డాలర్ల)కు చేరుకున్నాయి. అందులో ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వస్త్ర, పత్తి, మాంసం, పాల ఉత్పత్తులు, పండ్లు, సిరామిక్, కూరగాయల ఎగుమతులు అధికంగా జరగడం ఇందుకు దోహదపడ్డాయి. కేవలం వస్తువుల ఎగుమతులు మాత్రమే గతేడాది 4.71 శాతం క్షీణించి రూ. 35.90 లక్షల కోట్లుగా జరిగాయి. సేవల ఎగుమతులు 7.88 శాతం పెరిగి రూ. 32.31 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మన దేశ ఎగుమతులు అత్యధికంగా అమెరికా, యూఏఈ, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, యూకే, జర్మనీలకు వెళ్తున్నాయి. ఇక, భారత దిగుమతులు 7 శాతం తగ్గి రూ. 55.50 లక్షల కోట్లకు చేరాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఆ తర్వాత ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొట్లాటలు, ఇటీవల ఎర్ర సముద్రంలో హౌతీల దాడులతో ఎగుమతులు ప్రభావితమయ్యాయి. ఈ పరిణామాలు కొనసాగితే ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News