India Debt: రూ. 54.79 లక్షల కోట్లకు పెరిగిన విదేశీ అప్పు
వడ్డీ చెల్లింపులు 2023లో 22.54 బిలియన్ డాలర్ల(రూ. 1.90 లక్షల కోట్ల)కు పెరిగాయని పేర్కొంది.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత మొత్తం విదేశీ అప్పు 2023 నాటికి 31 బిలియన్ డాలర్లు(రూ. 2.62 లక్షల కోట్లు) పెరిగి 646.79 బిలియన్ డాలర్ల(రూ. 54.79 లక్షల కోట్ల)కు చేరాయని ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో పేర్కొంది. 2022లో వడ్డీ చెల్లింపులు 15.08 బిలియన్ డాలర్ల(రూ. 1.28 లక్షల కోట్ల) నుంచి 2023లో 22.54 బిలియన్ డాలర్ల(రూ. 1.90 లక్షల కోట్ల)కు పెరిగిందని పేర్కొంది. దీర్ఘకాల రుణాలు 7 శాతం పెరిగి 498 బిలియన్ డాలర్ల(రూ. 42.18 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. స్వల్పకాల రుణాలు కొంత క్షీణించి 126.32 బిలియన్ డాలర్ల(రూ. 10.70 లక్షల కోట్ల)కు చేరాయి. వీటితో పాటు ఎగుమతుల పరంగా భారత విదేశీ రుణాలు 80 శాతం ఉండగా, సేవల పరంగా 10 శాతం ఉంటాయని వరల్డ్ బ్యాంక్ నివేదిక పేర్కొంది. 2023లో దేశ నికర రుణ ప్రవాహాలు 33.42 బిలియన్ డాలర్లు(రూ. 2.83 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. అదే ఏడాదిలో నికర ఈక్విటీ నిధులు అత్యధికంగా 46.94 బిలియన్ డాలర్లు(రూ. 3.97 లక్షల కోట్లు) ఉన్నాయి. ఇది భారత మార్కెట్‌పై విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తిని ప్రతిబింబిస్తోందని వరల్డ్ బ్యాంక్ నివేదిక పేర్కొంది.