11 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి జూన్ 17 నాటికి భారత నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 11.18 శాతం పెరిగి రూ. 3,79,760 కోట్లకు చేరాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటనలో వెల్లడించింది.

Update: 2023-06-18 15:17 GMT

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి జూన్ 17 నాటికి భారత నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 11.18 శాతం పెరిగి రూ. 3,79,760 కోట్లకు చేరాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటనలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఈ వసూళ్లు రూ. 3,41,568 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం వసూళ్లలో రూ. 1,56,949 కోట్ల కార్పొరేట్ పన్ను వసూళ్లు కాగా, వ్యక్తీగ పన్ను వసూళ్లు(సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కలిపి) రూ. 2,22,196 కోట్లుగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్థూల వసూళ్లు(వాపసుల కోసం సర్దుబాటు చేయడానికి ముందు) 12.73 శాతం వృద్ధితో రూ. 4,19,338 కోట్లుగా ఉన్నాయి. స్థూల వసూళ్లలో రూ. 1,87,311 కోట్లు కార్పొరేట్ వసూళ్లు ఉండగా, వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ. 2,31,391 కోట్లుగా ఉన్నాయి. సమీక్షించిన కాలంలో ముందస్తు పన్ను వసూళ్లు రూ. 1,16,776 కోట్లు ఉండగా, ఇది గతేడాది ఇదే కాలంతో పొలిస్తే 13.70 శాతం ఎక్కువ. అందులో కార్పొరేట్ ముందస్తు వసూళ్లు రూ. 93,784 కోట్లు, వ్యక్తిగత వసూళ్లు రూ. 23,991 కోట్లుగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.


Similar News