మార్చి రెండో వారంలో రూ.2,378 కోట్ల నిధులను పొందిన భారత స్టార్టప్‌లు
భారత స్టార్టప్ కంపెనీల ఫండింగ్ సానుకూలంగా ఉంది. మార్చి రెండో వారంలో 30 స్టార్టప్ కంపెనీలు దాదాపు రూ.2,378 కోట్ల($287 మిలియన్ల) నిధులను పొందినట్లు Entrackr శనివారం వెల్లడించింది
దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టార్టప్ కంపెనీల ఫండింగ్ సానుకూలంగా ఉంది. మార్చి రెండో వారంలో 30 స్టార్టప్ కంపెనీలు దాదాపు రూ.2,378 కోట్ల($287 మిలియన్ల) నిధులను పొందినట్లు Entrackr శనివారం వెల్లడించింది. వీటిలో ప్రధానంగా ప్రారంభ స్టేజ్‌లో ఉన్న కంపెనీలు 20 కాగా, వృద్ధి స్టేజ్‌లో ఉన్నవి 6, మిగతావి పూర్తి వివరాలను వెల్లడించలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వృద్ధి స్టేజీలో ఉన్న ఆరు స్టార్టప్‌లు ఈ వారం రూ.1,939 కోట్ల($234 మిలియన్ల) నిధులను సేకరించాయి. 20 ప్రారంభ దశ స్టార్టప్‌లు రూ.439 కోట్ల($53 మిలియన్ల) విలువైన నిధులను సేకరించాయి.
గత వారం 27 స్టార్టప్‌లు రూ.2,544 కోట్ల($307.8 మిలియన్లు) ఫండింగ్‌ను పొందాయి. వీటిలో 17 ప్రారంభ దశలో, 7 వృద్ధి దశలో ఉన్న కంపెనీలున్నాయి. డేటా ప్రకారం, ప్రస్తుత వారంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు చెందిన స్టార్టప్‌లు 11 డీల్స్‌తో నిధులు సమకూర్చి మొదటి స్థానంలో నిలవగా, బెంగళూరు 10 డీల్‌లతో రెండో స్థానంలో, పుణె, ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా, మైసూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.