GDP Growth: భారత వృద్ధిని 7 శాతంగా అంచనా వేసిన డెలాయిట్

దేశంలో ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) లక్ష్యం పరిధిలోనే ఉందని..

Update: 2024-09-22 19:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ ఆర్థికవ్యవస్థ ప్రతికూలంగా ఉన్నప్పటికీ భారత్ ఆకర్షణీయమైన వృద్ధిని కొనసాగిస్తోందని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవాళ్లు ఎదురైనా సరే భారత్ 7 శాతం వృద్ధిని సాధిస్తుందని డెలాయిట్ దక్షిణాసియా సీఈఓ రోమల్ శెట్టి చెప్పారు. దేశంలో ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) లక్ష్యం పరిధిలోనే ఉందని, గ్రామీణ డిమాండ్ పుంజుకోవడం, వాహనాల విక్రయాలు మెరుగుపడటం వంటి అంశాలు వృద్ధికి దోహదపడనున్నాయి. 2024-25లో వృద్ధిని 7-7.1 శాతం మధ్య ఉంటుందని ఆశిస్తున్నాం. భౌగోళిక రాజకీయ పరిణామాలు, మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్‌లో రాజకీయ సంక్షోభం, పాశ్చాత్య దేశాల్లో మందగమనం వంటివి జీడీపీ వృద్ధిని ప్రభావితం చేయనున్నాయి. అయినప్పటికీ భారత్ సానుకూలంగా వృద్ధిని కలిగి ఉంటుందని డెలాయిట్ పేర్కొంది.  

Tags:    

Similar News