PM: దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీస్.. 16న మోడీ చేతుల మీదుగా స్టార్ట్
భారతదేశపు మొట్టమొదటి 'వందే మెట్రో' సర్వీస్ సోమవారం(సెప్టెంబర్ 16) నాడు పట్టాలు ఎక్కనుంది.
దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశపు మొట్టమొదటి 'వందే మెట్రో' సర్వీస్ సోమవారం(సెప్టెంబర్ 16) నాడు పట్టాలు ఎక్కనుంది. గుజరాత్‌లో అహ్మదాబాద్-భుజ్ మధ్య ప్రయాణించే వందే మెట్రో రైలును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. రైలును అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు. ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలు అందించారు. ఇది పూర్తిగా ఎయిర్ కండీషన్ కలిగి ఉంటుంది. దాదాపు 3000 మంది ప్రయాణించడానికి వీలవుతుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో కవర్ చేస్తుంది. ఈ ప్రయాణ దూరంలో రైలు తొమ్మిది స్టేషన్లలో ఆగుతుంది.
భుజ్ రైల్వే స్టేషన్‌లో తెల్లవారుజామున 5.50 గంటలకు ప్రారంభం అయి ఉదయం 10.50 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అహ్మదాబాద్‌లో ప్రారంభమై రాత్రి 11.10 గంటలకు భుజ్ చేరుకుంటుంది. ఈ రైలు పూర్తి అన్‌రిజర్వుడు. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు గుజరాత్‌లో పర్యటించనున్న మోడీ దేశంలోనే తొలి ‘వందే మెట్రో ’ సర్వీసును సోమవారం జెండా ఊపి ప్రారంభిస్తారని అధికారి ఒకరు తెలిపారు. ఈ రైలు ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.8,000 కోట్లను కేటాయించారు.