FPI: బడ్జెట్‌ ఎఫెక్ట్‌తో జులై నెలలో ఈక్విటీల్లోకి రూ.30 వేల కోట్ల ఎఫ్‌పీఐలు

లోక్‌సభ ఎన్నికల అనంతరం భారత ఈక్విటీ మార్కెట్‌లోకి విదేశీ కొనుగోలు దారులు పెద్ద ఎత్తున్న పెట్టుబడులు పెడుతున్నారు

Update: 2024-07-21 12:25 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల అనంతరం భారత ఈక్విటీ మార్కెట్‌లోకి విదేశీ కొనుగోలు దారులు పెద్ద ఎత్తున్న పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా విడుదలైన డేటా ప్రకారం, జులై నెలలో 19 తేదీ వరకు ఎఫ్‌ఫీఐలు దాదాపు దేశీయ ఈక్విటీల్లో రూ.30,772 కోట్ల కొనుగోళ్లు జరిపారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి రావడంతో గతంలో ఉన్న సంస్కరణలు కొనసాగే అవకాశం ఉంది. అలాగే కేంద్ర బడ్జెట్‌లో సంస్కరణలు, రాయితీలు ఉండే అవకాశం ఉండటంతో విదేశీ పెట్టుబడిదారులు ఈ నెలలో ఇప్పటి వరకు భారీగా ఇన్వెస్ట్ చేశారు.

అదే జూన్ నెలలో ఈక్విటీల్లోకి ఎఫ్‌పీఐల విలువ రూ.26,565 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు, మారిషస్‌తో భారతదేశ పన్ను ఒప్పందంలో మార్పులు, US బాండ్ ఈల్డ్‌లలో స్థిరమైన పెరుగుదలపై ఆందోళనలతో ఎఫ్‌పీఐలు మేలో ఎన్నికలకు ముందు రూ. 25,586 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 8,700 కోట్లకు పైగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. సమీక్షా కాలంలో డెట్ మార్కెట్‌లోకి ఎఫ్‌పీఐలు రూ.13,573 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఎఫ్‌పీఐలు జనవరి, ఏప్రిల్, మే నెలల్లో 60,000 కోట్ల రూపాయల మొత్తాన్ని విక్రయించగా, ఫిబ్రవరి, మార్చి, జూన్‌లలో కలిపి రూ. 63,200 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.

Tags:    

Similar News