అమ్మకాలలో దుమ్మురేపిన హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ అమ్మకాల పరంగా కీలక మైలురాయిని చేరుకుంది.

Update: 2023-04-01 10:41 GMT

బెంగళూరు: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ అమ్మకాల పరంగా కీలక మైలురాయిని చేరుకుంది. ఆర్థిక సంవత్సరం 2022-23 లో మొత్తం అమ్మకాలు 7,20,565 యూనిట్లుగా నమోదు చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 18 శాతం ఎక్కువ వృద్ధిని సాధించింది. మార్చి నెలలో విక్రయాలు, దేశీయంగా, ఎగుమతులు మొత్తం కలిపి 61,500 యూనిట్లను విక్రయించింది. ఇది ఏడాది క్రితం ఇదే కాలంలో విక్రయించబడిన 55,287 యూనిట్ల కంటే 11.2% ఎక్కువ.

కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, "2022-23 ఆర్థిక సంవత్సరం హ్యుందాయ్ మోటార్ ఇండియాకు ఒక అద్భుతమైన సంవత్సరం, సరికొత్త హ్యుందాయ్ టక్సన్, న్యూ వెన్యూ, వెన్యూ N లైన్, ఆల్ ఎలక్ట్రిక్ IONIQ 5, న్యూ గ్రాండ్ i10 NIOS, న్యూ AURA వంటి 7 సెగ్మెంట్ డిఫైనింగ్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాము. ప్రపంచవ్యాప్తంగా అడ్డంకులు ఉన్నప్పటికి కూడా మెరుగైన అమ్మకాలను సాధించి భారతీయ ఆటో పరిశ్రమ వృద్ధి కి మద్దతు అందించినట్లు” ఆయన పేర్కొన్నారు.

Also Read..

ఇక మలేషియాతో మన రూపాయల్లోనే వ్యాపారం.. 

Tags:    

Similar News