Hyundai: 2030 నాటికి 600 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్న హ్యుందాయ్..!
దేశీయ మార్కెట్ లో గత కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ వాహనాల(EV)కు గణనీయంగా డిమాండ్(Demand) పెరుగుతోన్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: దేశీయ మార్కెట్ లో గత కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ వాహనాల(EV)కు గణనీయంగా డిమాండ్(Demand) పెరుగుతోన్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో చాలా కంపెనీలు మార్కెట్లోకి ఈవీ బైకుల(Bikes)ను, కార్ల(Cars)ను లాంచ్ చేస్తున్నాయి. కానీ ఛార్జింగ్ స్టేషన్లు(Charging Stations) ఎక్కువగా లేకపోవడం వల్ల లాంగ్ జర్నీ(Long Journey) చేసే ఎలక్ట్రిక్ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా(South Korea)కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్(Hyundai) ఆధ్వర్యంలోని హ్యుందాయ్ మోటార్ ఇండియా(Hyundai Motor India) కీలక నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి దేశవ్యాప్తంగా 600 ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లును ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ స్టేషన్లలో ఇతర బ్రాండ్ ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులుకు కూడా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. హ్యుందాయ్ ఫంక్షన్ హెడ్ జే వాన్ ర్యూ(Jay Van Rue) మాట్లాడుతూ.. వచ్చే ఏడేళ్లలో దేశవ్యాప్తంగా ఈవీ మార్కెట్ వృద్ధి(Growth) చెందుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఇక 2027 వరకు తమిళనాడు(TN) రాష్ట్రంలో 100 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నామని, అందులో 10 స్టేషన్లు డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు.