దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమైన హ్యుందాయ్

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా విభాగం నిధుల సమీకరణ కోసం ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రాబోతుంది.

Update: 2024-06-15 10:17 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా విభాగం నిధుల సమీకరణ కోసం ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రాబోతుంది. దీనికి సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. దీని ద్వారా సుమారు $ 3 బిలియన్ల(రూ.25,000 కోట్ల) భారీ మొత్తాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సెబీ నుంచి ఆమోదం లభిస్తే, ఇప్పటి వరకు రూ.21,000 కోట్లతో ఎల్‌ఐసీ ఐపీఓ దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఉండగా, ఇప్పుడు హ్యుందాయ్ దాని స్థానాన్ని భర్తీ చేస్తుంది.

కంపెనీ ఒక్కొక్కటి రూ.10 ముఖ విలువ కలిగిన 14,21,94,700 ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. దీని వలన కంపెనీ విజిబిలిటీ, బ్రాండ్ ఇమేజ్‌ మరింత మెరుగవుతుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల విక్రయాల పరిమాణంలో మారుతి సుజుకి తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా నిలిచింది.

మేలో, హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం అమ్మకాలలో 63,551 యూనిట్లతో సంవత్సరానికి ఏడు శాతం వృద్ధిని సాధించింది. మార్కెట్ వర్గాలు పేర్కొన్న దాని ప్రకారం, హ్యూందాయ్ ఇండియా విభాగం ఎఫ్‌వై 23 రూ. 60,000 కోట్ల ఆదాయం, రూ. 4,653 కోట్ల లాభాలను నివేదించింది. 2023లో అత్యధిక దేశీయ విక్రయాల ఆరు లక్షల మార్కును హ్యూందాయ్ దాటింది. i20, వెర్నా, క్రెటా, ఆరా, టక్సన్ భారత మార్కెట్లో కంపెనీకి చెందిన కొన్ని కార్ మోడల్‌లు. కంపెనీ 1998లో ఇండియాలో తన మొదటి కర్మాగారాన్ని, 2008లో రెండోదాన్ని స్థాపించింది.


Similar News