భారీ సంఖ్యలో బుకింగ్స్ అందుకున్న హార్లే డెవిడ్‌సన్ ఎక్స్440

దేశీయ దిగ్గజ టూ-వీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ ఇటీవల విడుదల హార్లే డెవిడ్‌సన్ ఎక్స్440 బైక్ కోసం భారీ సంఖ్యలో బుకింగ్స్ వచ్చాయని మంగళవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన హార్లే డేవిడ్‌సన్‌తో కలిసి హీరో మోటోకార్ప్ అత్యంత

Update: 2023-08-08 08:38 GMT

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ టూ-వీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ ఇటీవల విడుదల హార్లే డెవిడ్‌సన్ ఎక్స్440 బైక్ కోసం భారీ సంఖ్యలో బుకింగ్స్ వచ్చాయని మంగళవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన హార్లే డేవిడ్‌సన్‌తో కలిసి హీరో మోటోకార్ప్ అత్యంత చౌకైన ద్విచక్ర వాహనం ఎక్స్440 మోడల్ బైకును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలై 4న ప్రారంభమైన వీటి మొదటి దశ బుకింగ్స్ తాజాగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 25,597 యూనిట్ల బుకింగ్స్ నమోదయ్యాయని కంపెనీ వెల్లడించింది. త్వరలో రెండవ దశ బుకింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపింది. హార్లే బ్రాండ్‌లో అతి తక్కువ ధరకే తెచ్చిన ఎక్స్440 కోసం వినియోగదారుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన లభించింది. అంచనాలకు మించి ప్రీ-ఆర్డర్లు రావడంతో ఈ నెల ప్రారంభంలో కంపెనీ అన్ని వేరియంట్ల ధరలు రూ. 10 వేలు పెంచింది. 'చాలామంది టాప్-ఎండ్ వేరియంట్ కోసమే బుక్ చేసుకున్నారు. ప్రీమియం బైకుల విభాగంలో ఇది తమకు మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో వినియోగదారులను మరిన్ని మోడల్ బైకులను అందించనున్నట్టు' హీరో మోటోకార్ప్ సీఈఓ నిరంజన్ గుప్తా అన్నారు. సెప్టెంబర్‌లో వీటి దేశీయ ఉత్పత్తి ప్రారంభిస్తామని, అక్టోబర్ నుంచి వినియోగదారులకు డెలివరీలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎక్స్440 ప్రారంభ ధర రూ. 2.39 లక్షలుగా ఉంది.


Similar News