గుడ్‌న్యూస్: అధిక వడ్డీ ఇచ్చే FD గడువు పొడిగించిన HDFC
దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే ఉద్దేశించిన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) పథకం గడువు పొడిగించింది
ముంబై: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే ఉద్దేశించిన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) పథకం గడువు పొడిగించింది. 2020, మేలో ప్రారంభించిన ఈ ప్రత్యేక సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ ద్వారా పెద్దలు అధిక వడ్డీ ప్రయోజనాలు పొందేందుకు వీలుంటుంది. తాజా గడువు పొడిగింపుతో ఈ ఎఫ్‌డీలో డిపాజిట్ చేసేందుకు 2024, జనవరి 10 వరకు అవకాశం ఉంటుంది.
ఈ స్పెషల్ ఎఫ్‌డీలో పెట్టుబడి ద్వారా పెద్దలకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల మధ్య కాలవ్యవధికి 3.50 శాతం నుంచి 7.75 శాతం వడ్డీని అందిస్తుంది. సాధారణ ఖాతాదారులకు బ్యాంకు 3-7.20 శాతం మధ్య వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్‌లకు అదనంగా 0.25 శాతం వడ్డీ ఇస్తోంది. సాధారణంగా ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్‌లకు ఇచ్చే అదనపు 0.50 శాతానికి ఇది అదనం.