HDFC Bank: తగ్గిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణ రేట్లు

వడ్డీ రేట్ల సవరణ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేటు పరిధి 9.10 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉండనుంది.

Update: 2025-04-06 18:30 GMT
HDFC Bank: తగ్గిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణ రేట్లు
  • whatsapp icon

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణాలు తీసుకున్న కస్టమర్లకు శుభవార్త ప్రకటించింది. రుణ రేట్లను తగ్గిస్తున్నట్టు బ్యాంకు సోమవారం ప్రకటనలో తెలిపింది. వివిధ కాలవ్యవధులకు సంబంధించి రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్) ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వడ్డీ రేట్ల సవరణ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేటు పరిధి 9.10 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉండనుంది. సవరించిన రేటు సోమవారం నుంచే అమల్లో వచ్చాయని బ్యాంకు పేర్కొంది. బ్యాంకు వివరాల ప్రకారం, ప్రధానంగా కస్టమర్లు తీసుకునే రిటైల్ రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటును 9.40 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గించింది. ఇతర కాలవ్యవధుల్లో ఓవర్‌నైట్, నెల రోజుల ఎంసీఎల్ఆర్‌ను 9.20 శాతం నుంచి 9.10 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్‌ను 9.20 శాతానికి, ఆరు నెలలు, రెండేళ్ల కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్‌ను 9.30 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్‌ను 9.45 శాతం నుంచి 9.35 శాతానికి తగ్గించింది. ఎంసీఎల్ఆర్ రేటు తగ్గింపు ఫలితంగా దీనికి అనుసంధానంగా ఉన్న వ్యక్తిగత, వాహన, గృహరుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.  

Tags:    

Similar News