Nitin Gadkari: యూనిఫామ్ టోల్ పాలసీపై ప్రభుత్వం కసరత్తు: నితిన్ గడ్కరీ

మొదటగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా పనిచేసే టోల్ విధానాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు.

Advertisement
Update: 2025-02-03 15:45 GMT
Nitin Gadkari: యూనిఫామ్ టోల్ పాలసీపై ప్రభుత్వం కసరత్తు: నితిన్ గడ్కరీ
  • whatsapp icon

దిశ, బిజినెస్ బ్యూరో: జాతీయ రహదారిపై ప్రయాణించే వారందరికీ ఒకే ప్రయోజనం చేకూర్చేలా యూనిఫామ్ టోల్ పాలసీపై పనిచేస్తున్నట్టు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సోమవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోడ్ల నాణ్యతపై అసంతృప్తులు, అధిక టోల్ ఛార్జీల గురించి వినిపిస్తున్న అసహనాలపై మాట్లాడిన గడ్కరీ.. ప్రయాణికుల ఇబ్బందులను యూనిఫామ్ టోల్ పాలసీ విధానం పరిష్కరిస్తుందన్నారు. ఇప్పటికే మన రోడ్లు అమెరికా రోడ్ల తరహాలో ఉన్నాయని, మొదటగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా పనిచేసే టోల్ విధానాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ప్రయాణికులు చేసే ఫిర్యాదులను చాలా సీరియస్‌గా తీసుకుంటామని, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని గడ్కరీ స్పష్టం చేశారు. ప్రస్తుతం నేషనల్ హైవేలపైన జరిగే 60 శాతం ట్రాఫిక్‌లకు కార్లు ప్రధాన కారణమని, వీటి నుంచే వచ్చే టోల్ ఆదాయం 20-26 శాతమే ఉంటోంది. మరోవైపు గత పదేళ్ల నుంచి కొత్త టోల్ ప్లాజాలు, ఛార్జీలు పెరగడం కొంత అసంతృప్తికి కారణమవ్వొచ్చని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 7,000 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. 2020-21లో సగటున రోజుకు 37 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగిందని, ఈ ఏడాది దాన్ని అధిగమిస్తామని పేర్కొన్నారు. 

Tags:    

Similar News