DGFT: ఉల్లి రైతులకు కేంద్రం భారీ శుభవార్త

ఉల్లి రైతులకు కేంద్రం భారీ శుభవార్త చెప్పింది. కనీస ఎగుమతి ధరను రద్దు చేస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-09-13 14:04 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఉల్లి రైతులకు కేంద్రం భారీ శుభవార్త చెప్పింది. కనీస ఎగుమతి ధరను తొలగిస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గతంలో కనీస ఎగుమతి ధర(MEP) టన్నుకు USD 550గా నిర్ణయించింది, దీని ప్రకారం, భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే రైతులు ఈ రేటు కంటే తక్కువకు విక్రయించడానికి వీలు లేదు. అయితే శుక్రవారం దీనిపై ఉన్న పరిమితిని తొలగించారు. దీనికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఆదేశాలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. MEPని తొలగించడం ద్వారా రైతులు అంతర్జాతీయంగా ఉన్న పోటీ ధరలకు అనుగుణంగా ఉల్లిని విక్రయించడానికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా దేశంలో ఉల్లిని పండించే కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ చర్య ద్వారా ప్రభుత్వం ఉల్లి రైతులను తన వైపు తిప్పుకునే అవకాశం పొందినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Similar News