Jaishankar: జాబ్ స్కామ్‌కు పాల్పడే వెబ్‌సైట్‌లపై ప్రాసిక్యూషన్‌ను ప్రభుత్వం సిఫార్సు

ఇలాంటి ఆన్‌లైన్ మోసాల ద్వారా ప్రజలు చట్టవిరుద్ధంగా పని చేస్తారని ఆయన అన్నారు.

Update: 2024-12-13 18:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: విదేశాల్లో మోసపూరిత ఉద్యోగాలు కల్పిస్తున్న కొన్ని వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని తన మంత్రిత్వ శాఖ అభ్యర్థించిందని, అలాంటి కుంభకోణాలకు పాల్పడిన వారిపై విచారణకు కూడా సిఫారసు చేసిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం లోక్‌సభకు తెలిపారు. ప్రభుత్వం కంబోడియా నుంచి 1,167 మందిని, మయన్మార్ నుంచి మరో 497 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చిందని, వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామనే సాకుతో అక్కడికి తీసుకెళ్లారని అన్నారు. ఇలాంటి ఆన్‌లైన్ మోసాల ద్వారా ప్రజలు చట్టవిరుద్ధంగా పని చేస్తారని ఆయన అన్నారు. భారత్‌లో అలాంటి ఉద్యోగాలను ప్రోత్సహించే సైట్‌లను బ్లాక్ చేయమని అభ్యర్థించాము. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులపై కొన్ని కేసులలో ప్రాసిక్యూషన్‌ను సిఫార్సు చేశామని మంత్రి వివరించారు. పశ్చిమాసియా, గల్ఫ్, మధ్యప్రాచ్య దేశాలకు భిన్నమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, చాలా తక్కువ చెల్లింపు లేదా వేతనాలు చెల్లించని పరిస్థితి, భారతీయ నిపుణులు, కార్మికులపై వేధింపులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. భారత రాయబార కార్యాలయాలు చురుగ్గా పనిచేస్తాయని, క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తాయని జైశంకర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News