గూగుల్‌ ఉద్యోగుల నిరసన

తొలగింపులు, పెరిగిన పనిభారంతో మిగిలిన ఉద్యోగుల్లో ఆందోళన, తమ ఉద్యోగాలపై కూడా భరోసా లేకుండా పోయిందని ఉద్యోగుల అసంతృప్తి

Update: 2024-01-22 13:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల పెద్ద ఎత్తున లేఆఫ్స్ ప్రకటించిన టెక్ దిగ్గజం గూగుల్‌కు ఉద్యోగుల నుంచి నిరసన సెగ తగిలింది. గడిచిన ఏడాది కాలంగా దాదాపు 15,000 మందిపై ప్రభావం చూపిన గూగుల్ లేఆఫ్స్ నిర్ణయంతో ఉద్యోగులు నిరా చెందారు. భవిష్యత్తులో మరిన్ని తొలగింపులు ఉంటాయనే సంకేతాల మధ్య వారు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టెక్ దిగ్గజం నుంచి వివిధ విభాగాలలో 1,000 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపిస్తూ వెలువడిన ప్రకటన తర్వాత ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. మొత్తం ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్, గత సంవత్సరంలో తొలగింపుల వల్ల దాదాపు 15,000 మంది సహోద్యోగులపై ప్రభావం కనబడిందని వెల్లడించింది. దాంతో జనవరి 18న యునైటెడ్ స్టేట్స్ అంతటా ఐదు గూగుల్ క్యాంపస్‌లలో నిరసనలు నిర్వహించేందుకు యూనియన్‌ పిలుపునిచ్చింది. తొలగింపులు, పెరిగిన పనిభారం కారణంగా మిగిలిన ఉద్యోగుల్లో ఆందోళన అధికంగా ఉందని, రానున్న రోజుల్లో తమ ఉద్యోగాలపై కూడా భరోసా లేకుండా పోయిందని ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన గూగుల్, పెరిగిన పెట్టుబడుల ప్రాధాన్యత, భవిష్యత్తు అవసరాల నిమిత్తమే నిర్ణయం తీసుకుంటున్నామని పేర్కొంది.

Tags:    

Similar News